SCROLL DOWN TO EXPLORE SITE

Friday, 3 August 2018

ఆధార్ హెల్ప్‌లైన్‌ నెంబరుపై 'గూగుల్' తప్పిదం

ఆధార్‌ జారీ సంస్థ యుఐడీఏఐ పాత హెల్ప్‌లైన్‌ నెంబరు ఆండ్రాయిడ్‌ ఆధారిత సెల్‌ఫోన్లలోని కాంటాక్ట్‌ జాబితాలో దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. ఇందువల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందనే ఆందోళన సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైంది. ఆ నెంబరును ఫోన్లలో నమోదు చేయమని ఫోన్‌ తయారీ సంస్థలు, నెట్‌వర్క్‌ సంస్థలను కోరలేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలేమీ, ఖాతాదార్లకు తెలియని నెంబర్లను మొబైల్‌ ఫోన్లలో నిక్షిప్తం చేయలేదని, ఆపరేటర్ల సంఘం కాయ్‌ తెలిపింది. పొరపాటు వల్ల జరిగిందని సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌ ప్రకటించింది.